చిత్రసీమలో కొన్ని కలయికలు ప్రేక్షకుల్లో ఆసక్తిని… అంచనాల్ని పెంచుతుంటాయి. సుధీర్‌బాబు – మోహనకృష్ణ ఇంద్రగంటి కలయిక అలాంటిదే. ‘సమ్మోహనం’, ‘వి’ తర్వాత ఆ ఇద్దరూ కలిసి చేసిన మరో చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం.
కథ విషయానికి వస్తే… హిట్ సినిమాల దర్శకుడు నవీన్ ( సుధీర్ బాబు) తను అనుకున్న సినిమాను తియ్యడం కోసం డాక్టర్ కళ్యాణి ( కృతి శెట్టిని )ఎంచుకుంటాడు. ఈ కథ మొత్తం హీరోయిన్ చుట్టూ తిరుగుతుంది. తన సినిమా కోసం కృతి శెట్టిని హీరోయిన్గా ఫిక్స్ చేస్తాడు. కానీ ఆమె నటించడం హీరోయిన్ తల్లి తండ్రులకు ఇష్టం ఉండదు. కొన్ని కండీషన్ల మీద ఒప్పుకుంటారు. అయితే అనుకోని ఓ సంఘటన వల్ల సుధీర్ బాబు, కృతి శెట్టి దూరమవుతారు. అసలు కృతీ శెట్టికి ఏమౌతుంది. వాళ్లిద్దరు కలుసుకుంటారా… లేదా…? అసలు సుధీర్ బాబు, ఎందుకు దూరం అవుతాడు అనేది ట్విస్ట్.
ప్లస్ పాయింట్స్…. ఈ సినిమా కథ కొత్తగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఈసారి ఇంద్రగంటి హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ సీన్స్‌ను గట్టిగా ప్లాన్ చేశాడు. ఈ ఇద్దరు స్టార్స్ కూడా ఆ సీన్స్‌ను అంతే అద్భుతంగా పండించారు. ఈ సినిమాకు కామెడీ స్ట్రాంగ్ ప్లస్ పాయింట్ అనుకోవాలి. దానితో పాటు ఇంట్రవెట్ ట్విస్ట్ అదరిపోతుంది. ఇంద్రగంటి మోహన కృష్ణ నుంచి ఈ సారి సరికొత్త సినిమా చూశామన్న ఫిలింగ్ కలిగించారు.
మైనస్ పాయింట్స్… ఇక ఈ సినిమాలో కొన్ని మైనస్ పాయింట్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇంద్రగంటి సినిమాల్లో నేచురల్‌గా కనిపించే సాగతీత వల్ల కొన్ని సీన్స్ బోరింగ్‌గా అనిపిస్తాయి. ఎడిటింగ్ విషయంలో కాస్త జాగ్రత్త పడితే బాగుండేది అనే ఫిలింగ్ కలుగుతుంది. సినిమా కాస్త స్పీడ్‌గా కదిలితే బాగుండు అనిపిస్తుంది.
ఎవరు ఎలా చేశారంటే… సుధీర్ బాబు నటన గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది… ఆయన ఎప్పటిలాగానే తన పరిధిమేర నటించారు. కాకపోతే ఆయన గెటప్ ఈ సారి కాస్త కొత్తగా అనిపించింది. ఇక కృతి శెట్టితో కెమిస్ట్రీ బాగా కుదిరినట్టు అనిపించింది. రొమాంటిక్స్ సీన్స్ కూడా అదరగొట్టాడు. ఇక కృతి శెట్టి తన నటనతో పాటు బ్యూటీతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఇక కమెడియన్స్ రాహుల్ రామకృష్ణ, వెన్నెల కిషోర్, అవసరాల తదితరులు సినిమాకు కామెడీతో నింపేశారు. వారి పాత్రల పరిది మేరకు అద్భుతంగా నటించారు.
టెక్నికల్ టీం… డైరెక్టర్ ఇంద్రగంటి మోహన కృష్ణ ఈసారి కొత్తగా ట్రై చేద్దామనుకున్నారు. కాని పాత వాసనలు మర్చిపోలేక పోయారు. కాని ఈ మూవీకి ఆయన మంచి కథను అందించాడు. పాత్రలకు తగ్గట్టుగా నటీనటులను ఎంచుకున్నాడు. ఇక ముఖ్యంగా ఈసినిమాకు తగ్గట్టు వివేక్ సాగర్ మ్యూజిక్ బాగా ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫీ పరవాలేదు అనిపిస్తుంది. ఇక నిర్మాణ విలువలు బాగున్నాయి.
చివరగా.. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనేది ఒక ఎమోషనల్ డ్రామా. కథా-కథనాల విషయం పక్కన పెడితే ఫ్యామిలీతో కలిసి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడగలిగే సినిమా ఇది.
మీకు సినిమాలు చూసే అలవాటు ఉంటే.. ఆ అమ్మాయి గురించి మనమూ తెలుసుకోవచ్చు…
రేటింగ్.. 2.5/5