బిగ్ బాస్ 6: రూ.100 ఇస్తా..వస్తావా.. కీర్తి భట్ పై అత్యాచారయత్నం..!!

-

బిగ్ బాస్ ఆరవ సీజన్లో రెండవ వారం జరుగుతున్న నేపథ్యంలో 21 మంది కంటెస్టెంట్ లు కూడా చాలా హుషారుగా ఆటలు ఆడుతూ విన్నర్ అవ్వడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే కొట్లాటలు, గొడవలు అన్నీ జరుగుతున్నాయి.. ఇవన్నీ కేవలం ఆట వరకు మాత్రమే అని నిరూపిస్తూ..ఎమోషనల్ గా ఒకరికొకరు బాగా కనెక్ట్ అయ్యారు. ఇకపోతే తాజాగా బిగ్ బాస్ హౌస్ లో సిసింద్రీ టాస్క్ పూర్తయిన విషయం తెలిసిందే. ఇక టాస్క్ తర్వాత బొమ్మలను బిగ్ బాస్ స్టోర్ రూమ్ లో పెట్టమని చెప్పినప్పుడు మెరీనా , ఆరోహి, రేవంత్ లు ఎమోషనల్ అయిపోయారు. ఆ సిసింద్రీ బొమ్మతో తమకున్న అనుబంధాన్ని వారు అంత త్వరగా వదిలించుకోవాలనుకోలేదని స్పష్టం అయింది.

అయితే అప్పుడు బిగ్ బాస్ బేబీ డాల్ తో తమకున్న అనుబంధాలను ఒక్కొక్కరిగా చెప్పాలి అని సూచించారు. ఇలా ప్రతి ఒక్కరు కూడా తమ జీవితంలో జరిగిన చేదు అనుభవాలను వెల్లడించారు.. ఇక ఈ క్రమంలోనే కీర్తి భట్ కూడా తాను జీవితంలో ఎదుర్కొన్న ఎన్నో అనుభవాలను చెబుతూనే మరోపక్క లైంగిక ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నాను అంటూ వెల్లడించింది. యాక్సిడెంట్ జరిగి కుటుంబంలో అందర్నీ కోల్పోయిన తర్వాత.. బంధువులు ఆస్తి ఇవ్వకపోగా ఇంటి నుంచి గెంటేసారంటూ ఎమోషనల్ అయింది. ఆ సమయంలో కట్టుబట్టలతో బెంగళూరు వచ్చేసాను.. అర్ధరాత్రి సమయంలో ఇంట్లో నుంచి చెప్పకుండా పారిపోయి వచ్చినప్పుడు చేతుల్లో డబ్బుల్లేవు.. రోడ్డు మీద నిలిచి ఉంటే నన్ను చూసి ఏ అమ్మాయి వస్తావా అని అడిగారు..

రూ.100, రూ.200 ఇస్తా..వస్తావా.. అన్నప్పుడు నాకు అర్థం కాలేదు.. ఆ తర్వాత నేను అలాంటి దానిని కాదంటూ అక్కడ నుంచి వెళ్లిపోయాను. అంతేకాదు ఇంకొకడు లైంగిక దాడికి కూడా పాల్పడ్డాడు.. కానీ తప్పించుకున్నాను.. ఇక డబ్బులు లేని సమయంలో 500 రూపాయలను చైన్ తాకెట్టు పెట్టి తీసుకున్నాను. ఇక 40 రూపాయలు పెట్టి టాప్స్ తీసుకొని వేసుకున్నాను.. ఇక తర్వాత టెలికాలర్గా ఉద్యోగం చేశాను అంటూ ఎంతో ఎమోషనల్ అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version