శివానుగ్రహం కోసం ప్రదోషం పూజలు ఇలా చేయండి !

-

శివం.. అంటే శుభం, మంగళం. సర్వశుభంకరం. అటువంటి పరమ శివుడి అనుగ్రహం పొందాలంటే… ప్రదోష పూజలు చేయాలి. ప్రదోషం అంటే పాపనిర్మూలన అని అర్ధం. ఈరోజు ప్రదోశ దినోత్సవం. ప్రతిరోజూ సూర్యాస్తమయం సమయంలో చంద్రుడి కదలిక వలన ఏర్పడునది ప్రదోషం. అంటే చంద్రుడి గతి వలన ఏర్పడే తిధుల సంధులలో సూర్యాస్తమయం. అయితే అప్పుడు ప్రదోషం అంటారు. అన్ని రోజుల ప్రదోషాలలో మూడు ప్రదోషాలకే ప్రాధాన్యం. అవి చతుర్ధి, సప్తమి, త్రయోదశి నాడు కలిగే ప్రదోషాలు. త్రయోదశి నాడు కలిగే ప్రదోషాన్ని మహాప్రదోషం అంటారు.

How to please Lord Shiva on Monday to fulfil your dreams

ఈ ప్రదోష సమయాన్ని సూర్యాస్తమయమునకు ముందర రెండున్నర ఘడియలు అంటే ఒక గంట…తర్వాత రెండున్నర ఘడియలు అంటే ఒక గంట అంటారు. ఈ దినము అనధ్యయనము.. అన్ని విద్యలకు గర్వితమైనది. సూర్యాస్తమయ కాలము తమోగుణ ప్రధానమైనది. ఆ సమయంలో ప్రదోషమైతే కొన్ని అనుష్ఠానములు చేయాల్సి ఉంటుంది. శివపూజ చేయాలి. ప్రదోష ఉపవాస దీక్షను పాటిస్తే పరమేశ్వరుడి కటాక్షం పొందవచ్చు అంటారు. అలా పాటించాలనుకునే వారు ప్రాత: కాలం స్నానం చేసి శుభ్రమైన తెల్లని వస్త్రాలు ధరించి శరీరంలో వివిధ భాగాలలో విభూతిని రాసి రుద్రాక్షమాల ధరించి శరీరంలో వివిధ భాగాలలో విభూతిని పూసి రుద్రాక్షమాల ధరించి పరమ పావనమైన పంచాక్షరీ మంత్రం ఓం నమశ్శివాయ అనే మహామంత్రాన్ని శక్తిమేరకు చేయండి.

ఇలా రోజంతా శివధ్యానంలో మునిగి ఉండి సూర్యాస్తమ సమయంలో స్నానమాచరించి ఇంటిలో పూజ ముగించి, శివాలయాన్ని దర్శించాలి. ప్రదోషకాలంలో శివాలయ దర్శనం, ప్రదక్షణలు, అభిషేకం అత్యంత ఫలాన్ని ఇస్తాయి. నవగ్రహదోషాలు, కాలసర్ప, అపమృత్యుదోషాలు ఈ ప్రదోష కాల సేవతో పోతాయని పండితులు పేర్కొంటున్నారు.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version