50 ఏళ్ళ పాటు దేశాన్ని పాలించిన సుల్తాన్, పెద్ద పేగు క్యాన్సర్ తో…!

-

గత కొంత కాలంగా పెద్ద పేగు క్యాన్సర్ తో బాధపడుతున్న ఒమన్ సుల్తాన్ ఖబూస్ బిన్ సయ్యద్ అల్ సయ్యద్ తుది శ్వాస విడిచారు. 29 ఏళ్ళ వయసులో ఒమాన్ అధ్యక్షుడిగా ఆయన ఎన్నికయ్యారు. 79 ఏళ్ళ సుల్తాన్, గత కొన్ని రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో వైద్యులు ఆయనకు వెంటిలేటర్ పై కూడా చికిత్స అందించినట్టు సమాచారం.

ఆరోగ్యం పూర్తి స్థాయిలో విషమించడంతో ఆయన మరణించారని, అధికారికంగా శనివారం ప్రకటించారు. ఆయన బ్రహ్మచారి కావడంతో వారసులు ఎవరూ లేరు. వారసత్వ పాలనను పూర్తి స్థాయిలో వ్యతిరేకించే వారు. బ్రతికి ఉన్న సమయంలో తన వారసుడిగా ఆయన ఎవరి పేరుని ప్రకటించలేదు. దీనితో ఆయన తర్వాత అధ్యక్ష బాధ్యతలను ఎవరు చేపడతారు అనేది ఆసక్తికరంగా మారింది.

ఇక ఆయన మరణంపై ప్రపంచ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు స్పందించారు. ఆయన పాలనలో ఒమాన్ అనేక రకాలుగా అభివృద్ధి సాధించిందని, ఆయన శాంతి నెలకొల్పే ప్రయత్నాలు చేసారని ప్రధాని నరేంద్ర మోడీ తన ట్విట్టర్ ఎకౌంటు లో పోస్ట్ చేసారు. మధ్యప్రాచ్యంలో ఒక దేశాన్ని అన్ని ఏళ్ళ పాటు పాలించిన ఒకే ఒక్క అధ్యక్షుడు ఆయన. దీనితో ఆయన మృతదేహాన్ని చివరి సారి చూడటానికి ప్రజలు తరలి వస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version