శంకర్ దాదాపు 15 ఏళ్ల క్రితం తీసిన బ్లాక్ బస్టర్ ఫిల్మ్ `అపరిచితుడు`. చియాన్ విక్రమ్, సదా జంటగా నటించిన ఈ చిత్రం నిర్లక్ష్యం నేపథ్యంలో రూపొంది సంచలనం సృష్టించింది. గరుడ పురాణంలోని శిక్షలని ఆధారంగా చేసుకుని జీవితంలో అన్యాయానికి గురైన ఓ వ్యక్తి మానసింక సంఘర్షణకు లోనై అపరిచితుడిగా మారి దోషుల్ని శిక్షించడం నేపథ్యంలో ఆలోచనాత్మకంగా ఈ చిత్రాన్నిశంకర్ తెరకెక్కించారు. ఇందులో తన చెల్లెలుని చిన్ననాడే అధికారుల నిర్లక్ష్యం కారణంగా కోల్పోయిన విక్రమ్, అతని తండ్రి సంబంధిత అధికారులు మినిస్టర్లపై పలు సెక్షన్‌ల కింత కేసు పెడతారు.
అచ్చం అలాంటి కేసే ప్రస్తుతం తెలంగాణ మంత్రి డైనమిక్ లీడర్ కేటీఆర్‌పై హైదరాబాద్‌కు చెందిన ఓ ఫ్యామిలీ పెట్టడం సంచలనంగా మారింది. ఇటీవల హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్గాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. చెరువుల్ని తలపించాయి. ఈ నేపథ్యంలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా నేరేడ్‌మెట్ సమీపంలోని కాకతీయ కాలనీకి చెందిన 12 ఏళ్ల సుమేధ నాళాలో పడి మృత్యు వాత పడింది. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు అధికారులు. ఎమ్మెల్యే, మినిస్టర్ నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిందని సంబంధిత జీహెచ్ ఎంసీ అధికారులు, స్థానికి ఎమ్మెల్యేతో పాటు మినిస్టర్ కేటీఆర్‌ని కూడా బాధ్యుడిని చేస్తూ నేరేడ్‌మెట్ పోలీస్టేషన్‌లో సుమేధ తల్లిదండ్రులు కేసు నమోదు చేయడం రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది.