సమ్మర్ స్పెషల్.. సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు

-

వేసవి వచ్చేసింది. పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ఇచ్చేశారు. ఇక పిల్లలంతా అమ్మమ్మ ఊళ్లకు, బంధువుల ఇళ్లకు వెళ్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో బస్సులు, రైళ్లలో రద్దీ నెలకొంటుంది. ఇందులో భాగంగానే వేసవి ప్రత్యేకంగా సికింద్రాబాద్‌ నుంచి పశ్చిమ బెంగాల్‌లోని షాలిమార్‌, సాంత్రాగాఛిలకు.. కేరళలోని కొల్లంకు ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

సికింద్రాబాద్‌-సాంత్రాగాఛి(07223) రైలు ప్రతి శుక్రవారం బయల్దేరుతుందని రైల్వే అధికారులు తెలిపారు. ఏప్రిల్‌ 19వ తేదీ నుంచి జూన్‌ 28వ తేదీ వరకు 11 ట్రిప్పులు వెళుతుందని వెల్లడించారు. ప్రతి శనివారం తిరుగు ప్రయాణమయ్యే సాంత్రాగాఛి – సికింద్రాబాద్‌(07224) ప్రత్యేక రైలు ఏప్రిల్‌ 20వ తేదీ నుంచి జూన్‌ 29వ తేదీ వరకు 11 ట్రిప్పులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో నల్గొండ, మిర్యాలగూడ స్టేషన్లలో ఈ రైళ్లు ఆగుతాయి. గుంటూరు, విజయవాడ, దువ్వాడ, విజయనగరం, భువనేశ్వర్‌, కటక్‌, ఖరగ్‌పుర్‌ మీదుగా రాకపోకలు సాగిస్తాయని వివరించారు.

సికింద్రాబాద్‌-షాలిమార్‌(07225) ప్రత్యేక రైలు ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 24 వరకు ప్రతి సోమవారం.. షాలిమార్‌-సికింద్రాబాద్‌(07226) రైలు ఏప్రిల్‌ 16 నుంచి జూన్‌ 25 వరకు ప్రతి మంగళవారం బయల్దేరుతాయి. ఈ రైళ్లు కూడా 11 ట్రిప్పులు తిరుగుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news