వేసవిలో శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడం చాలా అవసరం. రుతువు మారినప్పుడు మనలో కలిగే మార్పులు మన శరీరం మీద చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకే ఈ రుతువులో సరైన ఆహారాలని తీసుకోవడం అవసరం. శరీరాన్ని ఆరోగ్యంగా, హైడ్రేట్ గా ఉంచుతూ చర్మ సంరక్షణని అందించే ఆహారాలేమిటో ఇక్కడ తెలుసుకుందాం.
బేల్
ఉత్తరాదిన ఎక్కువగా దొరికే ఈ పండుని వేసవిలో తినడం చాలా మంచిది. దీనిలో ఉండే విటమిన్ సి, డయాబెటిస్ ని నియంత్రణలో ఉంచుతూ, జీర్ణ సమస్యలని దూరం పెడుతుంది. కొత్త శక్తిని ఇవ్వడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. ఐతే దీన్ని ఎలా తినాలో తెలుసుకుందాం.
దీనిలోని పీచుని నీళ్ళలో కలిపి అందులో కొద్దిగా చక్కెర, నిమ్మరసం కలిపి షర్బత్ లాగా తయారు చేయాలి. కొంచెం బెల్లం కలుపుకుంటే దానిలో ఉండే చేదు మరింత దూరమవుతుంది. ఆ తర్వాత హాయిగా తాగడమే.
జొన్నలు
శరీరానికి చల్లదనాన్ని అందించే జొన్నల్లో ఐరన్, మెగ్నీషియం అధికంగా ఉంటుంది. కాపర్, విటమిన్ బీ1 అధికంగా ఉండే దీన్ని రొట్టెల లాగా చేసుకుని ఆరగించాలి.
జీలకర్ర
శరీరంలోని విష పదార్థాలని దూరం చేసి, శరీరాన్ని చల్లబరిచే సుగంధ ద్రవ్యం జీలకర్ర. దురద్ద, మొటిమలతో ఇబ్బంది పడేవారు జీలకర్రని ఆహారంలో భాగంగా వాడాలి.
ఎలా తినాలంటే
కొద్దిగా జీలకర్రని తీసుకుని నీళ్ళలో వేడి చేయాలి. ఒక్కసారి చల్లారిన తర్వాత దానితో స్నానం చేస్తే చాలు. జీలకర్ర పొడిని బట్టర్ మిల్క్ ని కలుపుకున్నా బాగానే ఉంటుంది.
నిమ్మ గడ్డి
జీర్ణ సమస్యలని దూరం చేసే అద్భుతమైన ఆహారం నిమ్మగడ్డి. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతూ, జీవక్రియని పెంచి ఆరోగ్యంగా ఉంచుతుంది. నిమ్మగడ్డితో టీ చేసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.