స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌పై వడ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్న కేంద్రం..!

-

కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని తిరిగి వెనక్కి తీసుకుంది. చిన్న డిపాజిట్ స్కీమ్ వడ్డీ రేటును కట్ చేయము అని ప్రకటించింది. నేడు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని చెప్పారు. మోడీ ప్రభుత్వం ఒక్క రోజు లో తిరిగి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.

nirmala seetharaman

పొరపాటని దానిని విడుదల చేశామని నిర్మలా సీతా రామన్ చెప్పారు. నిజంగా ఇది విన్న సాధారణ జనం షాకయ్యారు. అలానే నిర్మల సీతారామన్ ట్విట్టర్ లో కూడా చెప్పడం జరిగింది. స్మాల్ సేవింగ్ స్కీమ్స్ వడ్డీలు అలాగే ఉంటాయని చెప్పడం జరిగింది. అనుకోకుండా ఆర్డర్ పాస్ అయిపోయింది అని ఆమె చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వడ్డీ రేట్ల తగ్గింపు ఉండదని స్పష్టం చేశారు. పాత వడ్డీ రేట్లు అలాగే కొనసాగుతాయని వెల్లడించారు. దీనితో చాల మందికి ఊరట కలగనుంది.

కేంద్రం యొక్క ఈ వాదనను మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ నాయకుడు పి.చిదంబరం తీసుకున్నారు. తర్వాత త్రైమాసికం లో పొదుపు పరికరాలపై వడ్డీ రేట్లు ప్రకటించడం సాధారణమని అన్నారు. అలానే బిజెపి ప్రభుత్వం తన సొంత ప్రయోజనం కోసం వడ్డీ రేట్లని తగ్గించిందని చిదంబరం అన్నారు. దొరికిపోవడం కారణంగా ఇలా చెప్తున్నారు అని చిదంబరం అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version