పాయల్ ఆరోపణలపై అనురాగ్ కి సమన్లు జారీ చేసిన పోలీసులు..

-

బాలీవుడ్ నటి పాయల్ ఘోష్, స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ పై లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఐదు సంవత్సరాల క్రితం ఒకానొక సినిమా కోసం పిలిచిన అనురాగ్, తనని లైంగికంగా వేధించాడని, అనవసరంగా తనని తాకాడని ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో అనురాగ్ కశ్యప్, పాయల్ చేసిన ఆరోపణలని ఖండించాడు. పాయల్ వ్యాఖ్యలు నిరాధారమంటూ ట్విట్టర్ వేదికగా కొట్టిపారేసాడు. మరో పక్క చాలా మంది బాలీవుడ్ హీరోయిన్లు అనురాగ్ కి మద్దతుగా నిలిచారు.

ఐతే తాజాగా అనురాగ్ కశ్యప్ కి పోలీసులు సమన్లు జారీ చేసారు. పాయల్ చేసిన వ్యాఖ్యలపై అనురాగ్ ని విచారించడానికి రేపు ఉదయం వెర్సోవా పోలీస్ స్టేషన్ కి హాజరు కావాలంటూ సమన్లు జారీ చేసారు. కరోనా కారణంగా థియేటర్లు మూతబడి ఇండస్ట్రీని ఇబ్బంది పెడుతున్న సమయంలో సెలెబ్రిటీలపై వస్తున్న ఆరోపణలు, కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version