హీలియోస్ క్యాపిటల్ వ్యవస్థాపకులు సమీర్ అరోరా గూగుల్ CEO సుందర్ పిచాయ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.త్వరలో ఆయన పై వేటు పడటమో లేక ఆయన రాజీనామా చేయడమో జరుగుతుందన్నారు హీలియోస్ క్యాపిటల్ వ్యవస్థాపకులు సమీర్ అరోరా. చాట్ బోట్ జెమినీ పనితీరుపై వివాదం చెలరేగిన వేళ ఓ నెటిజన్ అరోరాను అభిప్రాయం అడగగా ఈ విధంగా స్పందించారు. ఏఐ అభివృద్ధిలో విఫలమయ్యారని.. మరొకరు బాధ్యతలు అందుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. కాగా జెమినీ ఇమేజ్ జెనరేషన్పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
గూగుల్ గతేడాది డిసెంబర్‌లో ఈ అడ్వాన్స్‌డ్ వెర్షన్ జెమినీ ఏఐ టూల్‌ను టెక్ట్స్, ఫొటో, ఆడియో, వీడియో, కోడింగ్ వంటి వివిధ రకాల సమాచారాన్ని 90 శాతం ఖచ్చితత్వంతో అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల జెమినీ టూల్ ద్వారా సందేహాలు నివృత్తి చేసుకునే క్రమంలో లేదా సమాచారం తెలుసుకునే సమయంలో వ్యక్తిగత, సున్నితమైన డేటాని షేర్ చేయొద్దని గూగుల్ తెల్పింది.