ప్రస్తుతం టీం ఇండియా వెస్ట్ ఇండీస్ పర్యటనలో ఉంది, ఈ సిరీస్ ను దగ్గరుండి పరిశీలిస్తున్న మాజీ క్రికెటర్ మరియు కామెంటేటర్ సునీల్ గవాస్కర్ వెస్ట్ ఇండీస్ క్రికెట్ బోర్డు కు కొన్ని కీలక సూచనలు చేశాడు. ఇటీవల జింబాబ్వే లో జరిగిన వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ లో ఓడిపోయి వరల్డ్ కప్ కు దూరమైంది… కానీ గతంలో వన్ డే మరియు టీ 20 లలో రెండు సార్లు వరల్డ్ కప్ ను సాధించిన చరిత్ర ఉంది. కాగా టెస్ట్ సిరీస్ లోనూ పేలవంగా ఆడుతోంది. ఇందుకు ప్రధాన కారణం ఆ దేశ క్రికెట్ బోర్డు మ్యాచ్ ఫీజులను పెంచకపోవడమే అంటూ గవాస్కర్ లేవనెత్తాడు. సరైన మ్యాచ్ ఫీజులు లేకపోవడం మరియు ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాలు వారి క్రికెటర్లకు అందిస్తున్న అన్ని సదుపాయాలు కల్పించకపోవడం వంటి కారణాల వలన చాలా మంది లెజెండ్ ప్లేయర్స్ దేశవాళీ లీగ్ ల పేరుతో తమ టాలెంట్ ను వేరే దేశాలకు ఉపయోగపడేలా కృషిచేస్తున్నారు. అలంటి వారిలో బ్రేవో, పోలార్డ్, నరైన్ , రస్సెల్ లు ముందు వరుసలో ఉంటారు.
ఇకనైనా మీ క్రికెటర్లకు మంచి స్థాయిలో మ్యాచ్ ఫీజులను చెల్లించండి, లేదంటే రాబోయ్ కాలంలొ ఎవ్వరూ క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకోరు అంటూ సూచన చేశాడు సునీల్ గవాస్కర్.