టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 30 ఏళ్ళు దాటాడు. దీనితో అతని వారసుడు ఎవరు అనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. టీం ఇండియా భవిష్యత్తు కెప్టెన్ గా రిషబ్ పంత్ లేదా శ్రేయాస్ అయ్యర్ అంటూ కొందరు కామెంట్స్ చేసారు. ఢిల్లీ జట్టుని శ్రేయాస్ అయ్యర్ ముందుకు నడిపిస్తున్నాడు. ఇదే సమయంలో టీం ఇండియా ఓపెనర్ కెఎల్ రాహుల్ కూడా చర్చకు వచ్చాడు.
అతనే భవిష్యత్తు కెప్టెన్ అని అన్నాడు టీం ఇండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్. కెఎల్ రాహుల్ కు బాధ్యతలు ఇచ్చినప్పుడు అతను పరుగులు చేయగలడని చూపించడానికి గొప్ప అవకాశం ఉందని అన్నాడు. రెండవది, అతను ఒక వైపు కెప్టెన్ గా కూడా చేయగలడు అని పేర్కొన్నాడు. తన జట్టుకి ఒక ముద్ర కచ్చితంగా వేస్తాడు. అతనిని టీం ఇండియా వైస్ కెప్టెన్ కూడా చేయవచ్చు అని చెప్పాడు.