ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత తన బిడ్డ అని సీఎం కేసీఆర్ అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆమె డిమాండ్లను తప్పక నెరవేరుస్తానని చెప్పారు. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ సునీత ఎమ్మెల్యే అయ్యారన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడోసారి ఎన్నికలు జరుగుతున్నాయని.. మరోసారి సునీతకు ఘన విజయం అందించాలని ఓటర్లను సీఎం కోరారు.
సునీత ఎంతో సౌమ్యురాలని, నియోజకవర్గ ప్రజలు సమస్య చెప్పుకునేందుకు వస్తే శాంతంగా వారి సమస్యను విని పరిష్కారం చూపిస్తుందని సీఎం చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పుడు మూడోసారి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయని, ఈ ఎన్నికల్లో కూడా గొంగిడి సునీతకు అండగా నిలిచి ఘన విజయం కట్టబెట్టాలని ఓటర్లను కోరారు. సునీత మళ్లీ గెలిస్తే ఆలేరు నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.