సీనియర్ హీరోతో విమర్శల పై గట్టి కౌంటర్ ఇచ్చిన శ్రీ లీల..!!

-

రవితేజ హీరోగా, యంగ్ హీరోయిన్ శ్రీలీల నటిస్తున్న చిత్రం ధమాకా,నక్కిన త్రినాధరావు డైరెక్షన్లో యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా వస్తోంది.. భీమ్స్ సంగీతం అందించిన ధమాకా మూవీ ఈ శుక్రవారమే విడుదల కాబోతుంది.సందర్బంగా సినిమా ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా అదిరిపోయే అప్డేట్స్ ను అందిస్తూ ఆసక్తి పెంచుతున్నారు.

ఇప్పటికే ఈ సినిమా పై మంచి అంచనాలు నెలకొన్నాయి. హీరో రవితేజ ఈ హిట్ చాలా అవసరం. అందుకే అనేక  ఇంటర్వ్యూ లు ఇస్తూ సినిమా పై హైప్ క్రియేట్ చేస్తున్నాడు. అలాగే యంగ్ హీరోయిన్ శ్రీ లీల కూడా ఈ మూవీ కు ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. తాను కూడా మరో పక్క ఛానెల్స్ కు, మీడియా కు  వరసగా ఇంటర్వ్యూ లు ఇస్తోంది. ఇక ఇంటర్వ్యూ సందర్భం గా ఎప్పటినుండో నలుగుతున్న ప్రశ్న కు తనదైన శైలిలో జవాబు ఇచ్చింది.

ఇంటర్వ్యూ లో బాగంగా మీకంటే వయస్సు ఎక్కువ ఉన్న హీరోలతో చేయడం మీకు ఇబ్బంది గా లేదా అని అడిగారు. దానికి ఆమె నాకంటే ముందు ఎంతో మంది హీరోయిన్స్ అలాగే నటించారు, ఇప్పటికీ చాలా మంది సీనియర్స్ తో నటిస్తూ ఉన్నారు. వాళ్ళకు లేని భాద నాకు లేదని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పి తనపై విమర్శలు చేసే వారికి గట్టి కౌంటర్ ఇచ్చింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version