త్వరలో వాట్సప్ లో సూపర్ ఫీచర్

-

ప్రస్తుత రోజులలో యువత స్మార్ట్ ఫోన్లు లేకుండా ఉండలేకపోతున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రపంచవ్యాప్తంగా వీటి వాడుకము విపరీతంగా పెరిగిపోయింది.గతంలో కాల్స్, మెసేజ్‌ల వరకూ ఫోన్లు పరిమితమై ఉండేది .కానీ ఇప్పుడు మరింత స్మార్ట్‌గా మారడంతో అన్ని అవసరాలకు స్మార్ట్ ఫోన్స్ ప్రత్యామ్నాయంగా మారాయి. ముఖ్యంగా ప్రతి ఒక్కరి స్మార్ట్ ఫోన్స్‌లో కచ్చితంగా వాట్సాప్ ఉంటుంది. యూజర్లకు అనుగుణంగా వాట్స్అప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకువస్తూనే ఉంది.ఇక తాజాగా వాట్స్అప్ వినియోగదారులకు గుడ్ న్యూస్ అందించింది.

వాట్సాప్ మరో అద్భుతమైన ఫీచర్ను తీసుకురానుంది. రీసెంట్గా ఆన్లైన్లో ఉన్నవారి లిస్టు ఒకే చోట కనిపించేలా ఆప్షన్ను కల్పించనుంది. ఇందులో మనకు ముఖ్యమైన వారి నంబర్లను యాడ్ చేసుకోవచ్చు. అయితే వినియోగదారుల గోప్యత దృష్ట్యా వారి లాస్ట్ సీన్, ఆన్లైన్ స్టేటస్లు కనిపించబోవని సంస్థ తెలిపింది.ప్రస్తుతం ఆ ఆప్షన్ కొందరు బీటా యూజర్లకు అందుబాటులోకి వచ్చిందని, త్వరలోనే అందరూ ఉపయోగించుకోవచ్చని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news