‘సూపర్ మచ్చి` ట్రైలర్‌ వ‌చ్చేసింది..ఇరగదీసిన చిరంజీవి అల్లుడు

-

మెగాస్టార్‌ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ భర్త కళ్యాణ్‌ దేవ్‌ ఈ మధ్యే విజేత సినిమా తో టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టాడు. తొలి సినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కళ్యాణ్ సినిమాల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే ఆయన రెండవ సినిమాకి పులివాసు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్లోని తాజాగా సినిమానే ‘సూపర్ మచ్చి’. తమన్ స్వరాలను సమకూర్చిన ఈ సినిమా, ఇప్పటికే చిత్రీకరణను జరుపుకుంది.

రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాలో, కల్యాణ్ దేవ్ జోడీగా ‘రియా చక్రవర్తి’ కనిపించనుంది. అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. ఈ కథలోని వివిధ కోణాలను ట్రైలర్‌ ద్వారా ఆవిష్కరించే ప్రయత్నం చేశారు.లవ్‌, యాక్షన్, ఎమోషన్‌ ప్రధానంగా చేసుకుని కట్‌ చేసిన ఈ ట్రైలర్‌ ఆకట్టుకుంటుంది. ఈ కథలో హీరోయిన్‌ ప్రేమను పొందలేకపోయిన అజయ్‌.. విలన్‌ గా మారతాడని అర్థమవుతుంది. అటు హీరో తన పవర్‌ ఫుల్‌ డైలాగులతో అదరగొట్టాడు. కాగా.. ఈ సినిమా జనవరి 14 న థియేటర్లలో విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version