దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కోసం ఎన్నో రకాల సేవలని ఇస్తోంది. ఈ సేవల వలన చాలా మందికి ప్రయోజనం కలుగుతోంది. అమృత్ కలాష్ ని స్టేట్ బ్యాంక్ అంది. పరిమిత కాల ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ అమృత్ కలాష్ ని ఎస్బీఐ ప్రకటించింది.
ఇందులో మీరు డిపాజిట్ చేసిన మొత్తానికి మెచ్యూరిటీ వ్యవధి 400 రోజులు ఉంటుంది. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. 2023, ఫిబ్రవరి 15 నుంచి మార్చి 31 వరకూనే ఇది అందుబాటులో ఉంటుంది. మార్చి 31లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. సీనియర్ సిటిజన్‌లకు 7.6% వడ్డీ వస్తోంది. అదే ఇతరులకు 7.1% వస్తుంది.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి…?
దీని కోసం బ్యాంక్ బ్రాంచ్, ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా, ఎస్బీఐ యోనో యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
దాదాపు ఒక సంవత్సరం స్వల్ప కాలానికి మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది.
తక్కువ టైం లో స్కీమ్ పూర్తి కావాలి అంటే ఇదే బెస్ట్ ఆప్షన్.
పోస్ట్ ఆఫీస్ ఇస్తున్న వడ్డీ కంటే ఇది ఎక్కువ.
ఈ పథకం కాలవ్యవధి 400 రోజులు.
సీనియర్ సిటిజన్లకు రూ.లక్ష డిపాజిట్‌పై దాదాపు రూ.8,600 వడ్డీని వస్తుంది. అదే ఇతరులకు అయితే రూ. 1 లక్ష డిపాజిట్ 400 రోజుల్లో రూ. 8,017 వడ్డీ వస్తుంది.