సూపర్ స్పీడ్ ఐఫోన్ వచ్చేస్తుంది…! మ్యాక్ కంటే స్పీడ్…!

-

2020లో రాబోయే ఐఫోన్‌ల గురించి ఇప్పటికే చాలా పుకార్లు వచ్చాయి, ఇప్పుడు రాబోయే మాక్‌బుక్‌ల గురించి కూడా వార్తలు షికారు చేస్తున్నాయి. ఆపిల్ మాక్‌బుక్‌ ARM ప్రాసెసర్ ఆధారంగా పనిచేస్తుందని నివేదికలు సూచిస్తున్నాయి. ఇంటెల్ ప్రాసెసర్ వాడకుండా ఐప్యాడ్‌, ఐఫోన్ లో వాడే చిప్ వెర్షన్లను దీనిలో వాడుతున్నారు. కూడా ఉపయోగించే ఐఫోన్ చిప్‌సెట్ల వెర్షన్ ని వాడుతున్నారు.

మ్యాక్ బుక్ లో వాడే చిప్‌సెట్ A14 అని అంటున్నారు. దీనిని ఐఫోన్ 12 సిరీస్ కోసం వాడే అవకాశం ఉందని అంటున్నారు. ఇది సెప్టెంబర్ లో విడుదల చేస్తున్నారు. A14 ప్రపంచంలో మొట్టమొదటి వ్యాపారపరంగా లభించే 5nm ప్రాసెసర్‌గా అవతరించానున్నారు. మరియు సాంకేతిక పరిజ్ఞానం ప్రకారం, ఇది హై-ఎండ్ 2019 మరియు 2020 ప్రారంభంలో ఉన్న ఫోన్‌లకు మునుపటి తరం 7nm చిప్‌లతో పోలిస్తే మంచి ప్రయోజనాన్ని ఇస్తుంద౦టున్నారు.

దీనిని ఆపిల్ కోసం తైవానీస్ చిప్‌మేకర్ టిఎస్‌ఎంసి తయారుచేసే అవకాశం ఉంది, 5 ఎన్ఎమ్ చిప్స్ 7 ఎన్ఎమ్ కంటే 80 శాతం ఎక్కువ లాజిక్ డెన్సిటీకి సపోర్ట్ చేస్తుందట. ఇది అదనపు బ్యాటరి పవర్ లేకుండా 15 శాతం వరకు పనితీరు మెరుగుదలలకు లేదా 7nm చిప్‌ల పనితీరును 30 శాతం తక్కువ శక్తితో అందిస్తుందని అంటున్నారు. సింగిల్-కోర్ బెంచ్‌మార్క్‌ల విషయానికి వస్తే A13 కంటే 20 శాతం వేగంగా ఉంటుందని అంటున్నారు. కొత్త చిప్‌సెట్ 30 శాతం వేగవంతమైన ఎల్‌పిడిడిఆర్ 5 మెమొరీని కూడా తీసుకువస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news