ఉంటాడో ఊడిపోతాడో…సెనేట్ నిర్ణయంపై సర్వాత్రా ఉత్కంట..!!!

-

అమెరికా రాజకీయాల్లో హీట్ రోజు రోజుకి పెరిగిపోతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై డెమొక్రాట్ పార్టీ నేతలు ప్రవేశ పెట్టిన అభిశంసన తీర్మానంపై ఎప్పుడెప్పుడు సెనేట్ కి చేరుతుందో, సెనేట్ ఎటువంటి నిర్ణయాన్ని తీసుకుంటుందో అంటూ అమెరికా ప్రజలందరూ ఎంతో ఉత్కంటగా ఎదురు చూస్తున్నారు.డెమోక్రాట్లు ట్రంప్ పై రెండు విషయాలలో అభిశంసన ప్రవేశ పెట్టారు. దీనికి ప్రతినిధుల సభ కూడా ఆమోదం తెలిపిన విషయం విధితమే..అయితే..

ట్రంప్ పై అభిశంసన ప్రతినిధుల సభలో ఆమోదం తెలిపినా సెనేట్ లో మాత్రం రిపబ్లికన్ల మెజారిటీ ఉండటంతో అభిశంసన తీర్మానం వీగిపోవచ్చనే వార్తలు వినిపించాయి. కానీ తాజాగా ఇరాన్ పై యుద్ధం విషయంలో ట్రంప్ అధికారాలకి కత్తెర వేస్తూ వేసిన వ్యతిరేక ఓటింగ్ లో రిపబ్లికన్ పార్టీ నేతలు సైతం ట్రంప్ కి వ్యతిరేకంగా ఓట్లు వేయడంతో ప్రస్తుతం ఈ సెనేట్ ముందకు వచ్చిన అభిశంసనపై రిపబ్లికన్ నేతలు ఎలా స్పందిస్తారోనని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇదిలాఉంటే

 

ఒక వేళ సెనేట్ సైతం అభిశంసన కి ఆమోదం తెలిపితే ట్రంప్ అధక్ష్య పదవి నుంచి తప్పుకోకతప్పదని తెలుస్తోంది. ఇదిలాఉంటే ప్రతినిధుల సభ ఆమోదించిన అభిశంసన అభియోగ ప్రత్రాలను, కొత్తగా నియమితులైన ఏడుగురు నిర్వాహక సభ్యులకు బుధవారమే అప్పగించారు అధికారులు..అయితే ఈ పత్రాలను వారు గురువారం అధికారకంగా తీసుకుంటామని తెలిపినట్టుగా సెనేట్ మెజార్టీ పక్షనేత మిచ్ మెక్ తెలియచేశారు.మరి ట్రంప్ ఉంటాడో ఊడిపోతాడో తెలియాలంటే వేచి చూడాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news