గవర్నర్ గా “సూపర్ స్టార్ రజనీకాంత్” ?

-

జైలర్ తో కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్ లను అందుకుని రికార్డు సృష్టించిన రజనీకాంత్ ఇప్పుడు చాలా సంతోషంగా తరువాన తాను నటించబోయే సినిమాల గురించి ఆలోచిస్తున్నారు. కానీ రజినీ గురించి ఏవేవో వార్తలు అల్లుకుంటున్నాయి. గతంలో రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాలని అనుకుని మళ్ళీ అనారోగ్య కారణాలతో వెనకడుగు వేశారు. దీనితో మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని తెలిసిపోయింది. అయితే పరోక్ష రాజకీయాల్లో రజినీకాంత్ ను భాగం చేయడానికి దేశంలో అధికారంలో ఉన్న మోదీ ఆలోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తమిళనాడులో రజినీకున్న ఛరిస్మాను వాడుకోవడానికి మోదీ నిర్ణయించుకున్నట్లు సమాచారం… ఒక్క తమిళనాడులోనే కాదు దక్షిణాదిలో మరియు దేశంలో చాలా చోట్ల రజినీకి ఒక పేరుంది. ముఖ్యంగా తమిళనాడులోని అన్న డీఎంకే తో బీజేపీకి ఉన్న బంధాన్ని రజినీకాంత్ ద్వారా మరింత బలపరుచుకోవడానికి… అక్కడ వచ్చే ఎన్నికల్లో గెలుపు అవకాశాలను మరింత పెంచుకోవడానికి రజినికాంత్ ను గవర్నర్ ను చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.

ఇది లోలోపల జరుగుతున్న రహస్య చర్చలు.. మరి ఇది రజినీకాంత్ కు తెలుసా తెలియదా అన్నది ఎవరికీ తెలియదు. అధికారికంగా అటు రజినీ కానీ లేదా మోదీ కానీ ప్రకటిస్తే తప్ప తెలిసే ఛాన్స్ లేదు. మరి ముందు ముందు అయినా ఈ విషయంపై ఒక క్లారిటీ వస్తుందా అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news