ఖలీస్తానిలకు సపోర్టు.. పోలీసు అధికారిపై కెనడా సర్కార్ వేటు

-

కెనడాలోని హిందువులపై ఖలీస్తానిలు దాడులకు దిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రధాని మోడీ.. భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. ఇటువంటి వాటిని అంగీకరించబోమని కఠినంగా జవాబిచ్చారు. ఈ క్రమంలోనే కెనడా సర్కార్ హిందువులపై దాడులకు పాల్పడిన ఖలీస్తాని ఆందోళన కారులతో పాటు వారికి మద్దతుగా నిలిచిన ఓ పోలీస్ అధికారిపై వేటు వేసింది.

బ్రాంప్టన్లో ఖలిస్థాని జెండాతో కెనడా పీల్ ‌ప్రాంత రీజనల్‌ పోలీసు అధికారి హరీందర్ సోహీ ఆందోళనకు దిగారు. ఖలిస్థానికి మద్దతుగా, భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ దృశ్యాలు వీడియోలో రికార్డు అయ్యాయి. దీంతో కెనడా పోలీస్‌ శాఖ సోహీపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. కెనడా కమ్యూనిటీ సేఫ్టీ, పోలీసింగ్‌ యాక్ట్‌ నిబంధనలను బ్రేక్ చేశారనే కారణంతో హరీందర్‌ సోహీపై చర్యలు తీసుకున్నట్లు మీడియా రిలేషన్స్ ఆఫీసర్ రిచర్డ్‌ చిన్‌ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version