అర్హులందరికీ ఆసరా పెన్షన్లు – మంత్రి ఎర్రబెల్లి

-

రాష్ట్రంలో అర్హులందరికీ పెన్షన్లు ఇస్తున్నామని అన్నారు పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరాల శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. శుక్రవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు గువ్వల బాలరాజు, దానం నాగేందర్, పద్మా దేవేందర్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పెన్షన్లు అందిస్తున్నామని వెల్లడించారు. 2014 నుంచి తెలంగాణ రాష్ట్రంలో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, ఫైలేరియా వ్యాధిగ్రస్తులకు సీఎం కేసీఆర్ పెన్షన్లు ఇస్తున్నారని తెలిపారు.

సాఫ్ట్వేర్ సమస్యల వల్ల పెన్షన్లకు ఇబ్బంది వస్తున్న చోట సమస్యను పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 9,08,498 మందికి కొత్తగా పెన్షన్లు ఇస్తున్నామన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాలలో గ్రామంలో వెయ్యి మంది ఉంటే 60,70 మందికి మాత్రమే పెన్షన్లు అందుతున్నాయని వెల్లడించారు. అదే తెలంగాణలో మాత్రం వెయ్యి మందికి గ్రామంలో 600 నుంచి 700 మందికి పెన్షన్లు ఇస్తున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version