నల్లగొండ జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు దద్దమ్మలాగా ఉన్నారు : జగదీశ్వర్ రెడ్డి

-

ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని తిరోగమనంలో నడుపుతున్నారు. ఉన్నవి కూలగొట్టడం తప్ప.. కొత్తవి నిర్మించే ఆలోచన, తెలివి ఈ ప్రభుత్వానికి లేదు అని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు దద్దమ్మలాగా ఉన్నారు. కృష్ణ, గోదావరి నీళ్ల విషయంలో ఇద్దరు మంత్రులకు అవగాహన లేదు. మంత్రుల నిర్లక్ష్యంతో నీళ్లన్నీ సముద్రం పాలవుతున్నాయి.. మన పంటలు ఎండిపోతున్నాయి. గత 60 ఏళ్లలో కాంగ్రెస్ పాలనలో ఉన్న పరిస్థితులే..ఈ తొమ్మిది నెలలో కనిపిస్తున్నాయి. ఖమ్మం జిల్లా మంత్రుల అత్యాశ వల్లే నాగార్జునసాగర్ కెనాల్ కు రెండు చోట్ల గండి పడడం వాస్తవం.

మా హయాంలో సాగర్ కాలువకు గండి పడితే ఏడు రోజుల్లో పూర్తి చేశాం.. కానీ ఇప్పుడు 20 రోజులైనా దిక్కు లేదు. రాష్ట్రంలో అప్పుడే పోలీసు రాజ్యం మొదలుపెట్టిండ్రు. జిల్లా ఎస్పీతోపాటు ఇతర పోలీసు అధికారులు నిబంధనలను అతిక్రమించి చిన్న తప్పు చేసినా శిక్షకు అర్హులు అవుతారు. ఇంకా నాలుగేళ్లు ఉంది.. ముందుంది ముసళ్ళ పండుగ.. అప్పుడే ఏం మొదలైందని. రాష్ట్రంలో అందరికీ రుణమాఫీ అమలు చేయాలి. వెంటనే రాష్ట్రంలో రైతు భరోసాని అమలు చేయాలి అని జగదీశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version