తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పసుపు రైతులను ఆదుకోవాలని ఎంపీ అరవింద్ లేఖలో సీఎం కేసీఆర్ ను కోరారు. అధిక వర్షాలకు తోడుగా తెగుళ్లు వంటి సమస్య పసుపు పంట చాలా నష్టోపోయిందని లేఖలో వివరించారు. ఇప్పటి వరకు నష్ట పోయిన పంటను ప్రభుత్వం అంచనా వేయాలని కోరారు. అలాగే నష్ట పోయిన పసుపు రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని విజ్ఞాప్తి చేశారు.
అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకం రాష్ట్రంలో అమలు చేసి ఉంటే రైతులకు ఇలాంటి పరిస్థితుల్లో సాయం అయ్యేదని అన్నారు. పసుపు రైతులను ప్రస్తుత సమయంలో ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని ఎంపీ ధర్మపురి అరవింద్ లేఖలో తెలిపారు. అంతే కాకుండా పంట నష్ట పోయిన రైతులకు వెంటనే నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.