నిద్ర రావట్లేదన్న సుప్రీత.. నెటిజన్స్ ట్రోల్స్ వైరల్..!!

-

సుప్రీత.. ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న సురేఖవాణి కూతురు.. ఇకపోతే సినిమాలలో ఎంట్రీ ఇవ్వకముందే మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న సుప్రీత పలు వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. నిజానికి ఈమధ్య సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా స్టార్ అయిపోతున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీ వారసులకు సంబంధించి అతి తక్కువ సమయంలోనే మంచి ఫాలోయింగ్ తీసుకొచ్చి పెడుతోంది ఈ సోషల్ మీడియా. ఇంకా ఈ క్రమంలోనే యాంకర్ రవి కూతురుతో పాటు శేఖర్ మాస్టర్ కూతురు అలాగే రోజా కూతురు ఇలా చాలామంది సెలబ్రిటీల వారసులు సోషల్ మీడియాను ఏలేస్తున్నారు.

ఈ క్రమంలోనే సురేఖ వాణి కూతురు కూడా బాగా పాపులర్ అయింది. ఇటీవల సురేఖ వాణి హీరోయిన్ల కంటే ఎక్కువ గ్లామర్ వలకబోస్తూ విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఇకపోతే గత కొంతకాలం నుంచి సురేఖ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా మారిన విషయం తెలిసిందే. ఇక సుప్రీతా కూడా తల్లి ద్వారా సెలబ్రిటీ హోదాను మాత్రం సంపాదించుకొని మరింత యాక్టివ్ గా ఉంటూ మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఇక మోడ్రన్ మామ్ గా గుర్తింపు తెచ్చుకున్న సురేఖవాణితో సుప్రీత ఉంటే మాత్రం ఎవరూ కూడా వీళ్లను తల్లి కూతుర్లు అని అనుకోరు. అక్క చెల్లెలు అని అనుకున్నా కూడా తప్పేం లేదు అంటూ వీరిని చూసిన వారందరూ చెబుతూ ఉంటారు.

ఇకపోతే ఇటీవల ఇంస్టాగ్రామ్ ద్వారా నిత్యం ఏదో ఒక పోస్ట్ పెడుతూ బాగా హల్చల్ చేస్తూ.. నెటిజనులు నెగిటివ్ కామెంట్స్ ఇస్తే దిమ్మతిరిగే రేంజిలో రిప్లై ఇస్తూ ఉంటుంది సుప్రీత. ఈ క్రమంలోనే తనకు “నిద్ర పట్టట్లేదు అంటూ ఏదైనా మాట్లాడండి అన్నట్లు” ఆమె పెట్టడంతో తన ఫ్రెండు నన్ను కలువు అని మెసేజ్ చేశాడు. ఇక సుప్రీత నువ్వు ఎప్పుడు బిజీగా ఉంటావు కదా రా..ఇక పేరుకు బెస్ట్ ఫ్రెండ్ అని ఆమె కామెంట్ చేసింది ప్రస్తుతం ఆ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారగా నెటిజన్లు కూడా బాగా ట్రోల్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version