ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగాల్సిన స్థానిక ఎన్నికలను ఒక పద్ధతి ప్రకారం చంద్రబాబు ఆపేశారు అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు హయాంలో ఎన్నికల కమిషనర్ గా తన సామాజిక వర్గానికి చెందిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని నిర్ణయించుకోవడం జరిగింది అని విమర్శించారు. అటువంటి ఎన్నికల కమిషనర్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉందని ఆరోగ్యశాఖ తో కూడా సంప్రదించకుండా సొంతంగా నిర్ణయం తీసుకుని ఆదేశాలు ఇవ్వడం ఏంటని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
అయితే ఈ విషయాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ సుప్రీం కోర్టుకు వెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలో గట్టి లాయర్ తో వైయస్ జగన్ వాదించటానికి చర్చలు జరుపుతున్నట్లు గట్టిగా వాదిస్తే స్థానిక సంస్థల ఎన్నికలు పది రోజుల ముందే జరుపుకోవచ్చు అనే తీర్పు సుప్రీం కోర్టు నుండి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ విధంగా తీర్పు వస్తే జగన్ నెత్తిన సుప్రీంకోర్టు పాలు పోసినట్లు అవుతుందని…లోటు బడ్జెట్ కలిగిన రాష్ట్రంలో 5 వేల కోట్ల నిధులు రావటం అంటే మామూలు విషయం కాదు అని అంటున్నారు.