కొడంగల్‌లోని లగచర్లలో ఇటీవల భూముల సర్వే కోసం వెళ్లిన అధికారులపై దాడులు జరిగిన విషయం తెలిసిందే. దీనిపై సీరియస్ అయిన తెలంగాణ ప్రభుత్వం దాడికి గల కారుకులను అదుపులోకి తీసుకుని వారిపై కేసులు పెట్టింది. అందులో పురుషులతో పాటు మహిళలు సైతం ఉన్నారు.వీరంతా గిరిజనులు కావడం గమనార్హం.
దీంతో ఇటీవల కేటీఆర్ కొందరు గిరిజన నేతలు, మాజీమంత్రులను వెంటబెట్టుకుని సంగారెడ్డి జైలుకు వెళ్లి వారిని పరామర్శించారు. తాజాగా కొడంగల్‌కు చెందిన ఓ యువతి ఆ దాడి ఘటనపై సీరియస్ అయ్యింది. తమ వారిని అన్యాయంగా జైల్లో పెట్టారని ఆరోపించింది. రాహుల్ గాంధీ అన్న ఒకసారి మా కొడంగల్‌కు రావాలని పత్లావత్ జ్యోతి అనే మహిళ డిమాండ్ చేశారు. ఆయన రాలేకపోతే ఆయన ఎక్కడున్నాడో అడ్రస్ చెప్పండి మేమే వెళ్తాం అని అన్నారు. ఆమె వెంట ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఉన్నారు.