నూతనంగా ఢిల్లీలో నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని త్వరలోనే ఓపెనింగ్ చేయనున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ భవనాన్ని ప్రధమంత్రి నరేంద్ర మోదీ చేత ఓపెనింగ్ చేయించనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో విపక్షాలు భగ్గుమంటున్నాయి. దేశానికి తొలి ప్రధమ వ్యక్తి అయిన రాష్ట్రపతి చేత ఈ పార్లమెంట్ ఓపెనింగ్ ను జరిగేలా చేయాలని విమర్శలు మొదలెట్టారు. పైగా మోదీ కనుక ఈ ప్రారంభోత్సవాన్ని చేస్తే హాజరు కామని విపక్షాలు చాలా మంది ఇప్పటికే ప్రకటించారు. ఇక ఇంతకు ముందు సుప్రీమ్ కోర్ట్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేత ఈ ఓపెనింగ్ చేయించాలని కొందరు పిటిషన్ వేశారు.
రాష్ట్రపతి పై వేసిన పిటీషన్ ను కొట్టేసిన సుప్రీం కోర్ట్ …
-