న్యాయపరిశీలనకు సంబంధించిన విషయాలపై సందేశాలు, వ్యాఖ్యలు, కథనాలతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను దుర్వినియోగం చేయడంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.న్యాయమూర్తులు బేలా త్రివేదీ అనిరుద్ధ బోస్ లతో కూడిన ధర్మాసనం తీర్పు కోసం రిజర్వ్ చేసిన కేసుకు సంబంధించి ఫేస్‌బుక్ పోస్ట్‌ను అస్సాం ఎమ్మెల్యే కరీం ఉద్దీన్ బర్భూయా తప్పుదారి పట్టించాడు.ఈ మేరకు అతనిపై ధిక్కార చర్యలు తీసుకున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసింది.
‘ఇటీవల కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న విషయాలకు సంబంధించిన అంశాలు నెట్టింట్లా విపరీతంగా దుర్వినియోగం చేయడం తీవ్రమైన ఆందోళన కలిగించేదిగా ఉంది. న్యాయస్థానాలు నిందలు, విమర్శలను భరించేంత విశాలత్వాన్ని కలిగి ఉన్నప్పటికీ, కోర్టులో పెండింగ్‌లో ఉన్న విషయాలకు సంబంధించిన వ్యాఖ్యలు, పోస్ట్‌లు వ్యక్తీకరణ హక్కు,వాక్ స్వాతంత్ర్యం ముసుగులో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా న్యాయస్థానాల అధికారాన్ని అణగదొక్కడం లేదా న్యాయానికి అంతరాయం కలిగించే విధంగా ఉంది. ఈ ధోరణిని తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని’ ధర్మాసనం పేర్కొంది. న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్నప్పుడు కొన్నిసార్లు ఏ పక్షానికైనా అనుకూలంగా, కొన్నిసార్లు వ్యతిరేకంగా వహరించడం చాలా సాధారణమని ధర్మాసనం పేర్కొంది.