గురువారం తీర్పు వెలువరించనున్న సుప్రీం
భారతదేశంలో స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తున్న ఐపీసీ 377 సెక్షన్ చెల్లుబాటుపై గురువారం సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ సెక్షన్ను కొనసాగించాలా లేదా అనే విషయాన్ని సుప్రీం కోర్టు నిర్ణయించనుంది. కొన్ని విదేశాల్లో స్వలింగ సంపర్కం అనేది నేరం కాదు.. కాబట్టి ఐపీసీ 377 సెక్షన్ చెల్లుబాటును సవాల్ చేస్తూ సుప్రీం లో పిటీషన్లు దాఖలైన సంగతి తెలిసిందే.. అక్టోబర్ 2న పదవీ విరమణ చేయనున్న దీపక్ మిశ్రా సారధ్యంలోని ధర్మాసనం తీర్పుని వెలువరిస్తున్న ముఖ్య కేసుల్లో ఇది కూడా ఒకటి కావడం గమనార్హం. ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక సార్లు ఈ సెక్షన్ని తొలగించాలంటూ ర్యాలీలు నిర్వహించిన సంగతి తెలిసిందే.