సెక్స్ వర్కర్లకు ఆధార్ కార్డులు ఇవ్వాల్సిందే.. సుప్రీంకోర్టు తీర్పు

-

సుప్రీం కోర్టు మరో సంచలన తీర్పు ఇచ్చింది. కరోనా సమయంలో.. సెక్స్‌ వర్కర్లు ఎదుర్కొన్న సమస్యలపై తాజాగా విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. వారికి ఆధార్‌ కార్డులు ఇవ్వాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. యూఐడీఏఐజారీ చేసే ప్రొఫార్మా సర్టిఫికేట్‌ ఆధారంగా.. ఆధార్‌ కార్డులు ఇవ్వాలని సూచనలు చేసింది.

sex-workers

సెక్స్‌ వర్కర్ల గుర్తింపును బహిర్గతం చేయకూడదని.. వారి గోప్యతను కాపాడాలని జస్టిస్‌ లావు నాగేశ్వరరావు నేతృత్వంలోని… ధర్మాసంన స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు సెక్స్‌ వర్కర్ల జాబితాను రూపొందించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.

రేషన్‌ అందని వారినిసైతం గుర్తించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు సెక్స్‌ వర్కర్ల జాబితాను రూపొందించాలని సుప్రీం పేర్కొంది. రేషన్ అందని వారిని సైతం గుర్తించాలని స్పష్టం చేసింది. వారికి ఎలాంటా గుర్తింపు కార్డులు లేదన్న కారణంగా.. రేషన్‌ పంపిణీని అడ్డుకోవద్దని సూచనలు చేసింది సుప్రీం కోర్టు.

Read more RELATED
Recommended to you

Exit mobile version