యువకుడి పీకకోసి హత్య చేసిన స్నేహితులు..

-

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో దారుణం చోటు చేసుకుంది.. బలరామునిపేట రాజీవ్ నగర్ కాలనీలోని స్మశానవాటికలో నలుగురు వ్యక్తులు కలిసి ఓ యువకుడి పీకకోసి హత్య చేశారు. చలరస్తా సెంటరులోని ఒక బార్‌లో మద్యం సేవించిన అనంతరం భోగేశ్వరరావు తోపాటు ఉన్న నలుగురు వ్యక్తులు కలిసి రాజీవనగర్ లోని స్మశానవాటిక వద్దకు వెళ్లారు. అయితే అక్కడ ఏం జరిగిందో తెలయదు గానీ.. భోగేశ్వర రావును తనతో పాటు వచ్చినవారు హత్య చేశారు. భోగేశ్వర రావు పంపులపని చేసుకుంటూ కాళీ సమయాల్లో ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తుంటాడు.

అయితే.. స్మశానవాటిక కాలనీకి అతిసమీపంలో ఉండటం వలన దాడి జరిగిన అనంతరం పెద్ద అరుపు విన్న కాలనీ వాసులు రక్తపు మడుగులో ఉన్న బాధితుడిని ఆసుపత్రికి చేర్చే ప్రయత్నం చేయగా అప్పటికే ప్రాణం పోయినట్లు గ్రహించి మృతదేహాన్ని ఇంటివద్దకు చేర్చారు కాలనీ వాసులు.సమాచారం తెలుసుకున్న వెంటనే బందరు టౌన్ డిఎస్పీ మాసుం భాష ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version