తెలంగాణ సీఎస్ కు సుప్రీం కోర్టు నోటీసులు

-

తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్ర‌ట‌రీ సోమేశ్ కుమార్ కు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. గ‌త కొద్ది రోజుల క్రితం తెలుగు రాష్ట్రాల‌లో ఉద్యోగ విభ‌జ‌న జ‌రిగింది. అందు లో భాగంగా ఆంధ్ర ప్ర‌దేశ్ లో ప‌ని చేస్తున్న 12 ఉద్యోగుల‌ను తెలంగాణ కు కేటాయిస్తు సుప్రీం కోర్టు తీర్పు ను ఇచ్చింది. అయితే సుప్రీం కోర్టు తీర్పు ను తెలంగాణ రాష్ట్ర సీఎస్ ఇప్ప‌టి వ‌ర‌కు అమ‌లు చేయాలేద‌ని ఒక ఉద్యోగి సుప్రీం కోర్టు లో సీఎస్ పై కోర్టు దిక్క‌ర‌ణ పిటిష‌న్ వేశాడు. అయితే ఈ పిటిష‌న్ పై సుప్రీం కోర్టు ధ‌ర్మాస‌నం విచార‌ణ చేసింది.

అంతే కాకుండా తెలంగాణ రాష్ట్ర సీఎస్ సోమేశ్ కుమార్ కు కోర్టు దిక్క‌ర‌ణ నోటీసులు ను సుప్రీం కోర్టు ధ‌ర్మాస‌నం జారీ చేసింది. అంతే కాకుండా డిసెంబ‌ర్ 3 వ తేది లోపు స‌మాధానం ఇవ్వాల‌ని ఆదేశించింది. ఒక వేల ఈ తేది లోపు స‌మాదానం ఇవ్వ‌క పోతే విచార‌ణ కు వ్య‌క్తిగ‌తం గా హాజ‌రు కావాల్సి వ‌స్తుంద‌ని సుప్రీం కోర్టు తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version