అర్నబ్‌ గోస్వామి బెయిల్ పిటిషన్‌పై నేడు సుప్రీంలో విచారణ..రిజిస్ట్రార్‌ తీరుపై బార్‌ అసోసియేషన్‌ ఆగ్రహం.

-

రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌, యజమాని అర్నబ్‌ గోస్వామి బెయిల్ పిటిషన్‌ను నేడు సుప్రీంకోర్టు విచారించనుంది..2018లో వ్యక్తి ఆత్మహత్య కేసులో బాంబే హైకోర్టు తన బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించిన వెంటనే అర్నబ్‌ గోస్వామి సుప్రీం కోర్టును నిన్న ఆశ్రయించారు..వెంటనే ఇవాళ ఉదయం 10.30 గంటలకే ఈ కేసు లిస్ట్‌ చేసింది సుప్రీం కోర్టు రిజిస్ట్రార్‌ కార్యాయలయం..అర్నబ్‌ గోస్వామి పిటిషన్ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని బెంచ్‌ విచారించనుంది.
మరోవైపు అనేక కేసులు నెలల తరబడి పెండింగ్‌లో ఉంటే రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌ అర్నబ్‌ గోస్వామి కేసును అర్జంట్ గా ఒక్క రోజులోనే ఎలా లిస్ట్‌ చేశారని సుప్రీం కోర్టు రిజిస్ట్రార్‌ను సీనియర్‌ లాయర్‌ దుష్యంత్‌ దవే ప్రశ్నించారు..ప్రస్తుతం సుప్రీం కోర్టులో దీపావళి సెలువులు కొనసాగుతున్నాయి..చీఫ్‌ జస్టిస్‌ బాబ్డే నుంచి ఆదేశాలు లేకుండా అంత అర్జంటుగా అర్నబ్‌ గోస్వామి పిటిషన్‌ను స్వీకరించడానికి వీల్లేదని చాలా ఘాటుగా లేఖ రాశారు సుప్రీం కోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కూడా అయిన దుష్యంత్‌ దవే.. చీఫ్‌ జస్టిస్‌ ఆదేశాల మేరకు అర్జంటుగా లిస్ట్‌ చేశారా లేదా సెక్రటరీ జనరల్‌ ఆదేశాలతో చేశారా తెలపాలని కోరారు. గత కొంతకాలంగా సుప్రీం కోర్టులో కేసుల లిస్టింగ్‌లో వివక్ష చూపిస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. వ్యవస్థ మొత్తం కంప్యూటరీకరించినపుడు, కేసులు ఆటోమేటిగ్గా విచారణకు రావాలే గాని..ఇలా అర్జంట్ ఎలా లిస్ట్‌ చేస్తారని దవే ప్నశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version