సుప్రీం కోర్టు యూట్యూబ్ చానెల్ హ్యాక్..

-

సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు చెందిన అధికారిక యూట్యూబ్‌ ఛానల్‌ను హ్యాక్‌ చేశారు. అంతేకాకుండా అందులో క్రిప్టో కరెన్సీని ప్రమోట్‌ చేస్తున్నట్లుగా ఉన్న వీడియోలను సైబర్ నేరగాళ్లు పోస్ట్‌ చేశారు. అయితే, ఈ యూట్యూబ్‌ ఛానల్‌ను కేసుల విచారణకు సంబంధించిన లైవ్ వీడియోలను ప్రసారం చేయడానికి గత కొంతకాలంగా సుప్రీంకోర్టు వినియోగిస్తున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఈ యూట్యూబ్ చానెల్ హ్యాక్ అయ్యింది. అందులో వీడియోలకు బదులు అమెరికాలోని రిపిల్‌ ల్యాబ్స్‌కు చెందిన క్రిప్టో కరెన్సీ ఎక్స్ ‌ఆర్పీని ప్రచారం చేస్తూ వీడియోలు దర్శనం ఇస్తున్నాయి. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే, దీనిపై సుప్రీం న్యాయవ్యవస్థ ఇంకా స్పందించలేదు.కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ప్రస్తుతం ఆ చానెల్‌ను పునరుద్ధరిస్తున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news