సుప్రీం ఎదుట చేతులెత్తేసిన కేంద్రం…

-

రఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి అవకతవకలపై సుప్రీం ఎదుట కేంద్ర ప్రభుత్వం తెల్లమొఖం వేసింది. ఫ్రాన్స్‌ నుండి 36రఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు కుంభకోణంపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తును కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు తీర్పుని రిజర్వ్ చేసింది.. ఈ పిటిషన్లపై వాద ప్రతివాదనలను విన్న ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గగోరు, న్యాయమూర్తులు ఎస్‌కె కౌల్‌, కెఎం జోసెఫ్‌తో కూడిన ధర్మాసనం ఈ మేరకు తన నిర్ణయాన్నివెల్లడిస్తూ…. యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో చోటు చేసుకున్న అక్రమాలపై ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేయాలని పలువురు పిటిషనర్లు కోర్టును కోరారు.

విమానాల కొనుగోలు ధరని తాము ఇంతవరకు పార్లమెంటులోనే వెల్లడించలేదని అందుకు తాము కోర్టుకు అందించేందుకు సిద్ధంగా లేమని కేంద్రం బదులిచ్చింది. ఈ ఒప్పందంలోని వాస్తవాలను బహిర్గతం చేయకుండా యుద్ద విమానాల ధర విషయమై చర్చించే ప్రశ్నే లేదని న్యాయమూర్తులు తేల్చిచెప్పారు. దీంతో కేంద్ర వైఖరిపై సుప్రీం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news