ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు 100ముద్దులు ఇస్తాన‌న్న సుర‌రేఖావాణి.. మ‌రీ ఇంత బోల్డ్‌గానా!

-

తెలుగులో త‌న‌కంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సురేఖ‌వాణి. అందంతో పాటు మంచి న‌ట‌న ఆమె సొంతం. సైడ్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగానే కాకుండా అప్పుడప్పుడూ సినిమాల్లో మెయిన్ రోల్స్ కూడా చేస్తుంది. అయితే వ్య‌క్తిగ‌తంగా ఆమె త‌న భ‌ర్త‌ను కోల్పోయి కూతురితో ఉంటోంది. ఇక సినిమాల ప‌రంగా ఈ మ‌ధ్య కాస్త గ్యాప్ తీసుకున్న‌ట్టు క‌నిపిస్తోంది.

ఆమె ఈ మ‌ధ్య సినిమాల్లో న‌టించింది చాలా త‌క్కువ‌. నిజం చెప్పాలంటే అవ‌కాశాలు రావ‌ట్లేద‌నే చెప్పాలి. ఇదిలా ఉంటే ఆమె ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై బోల్డ్ కామెంట్లు చేసింది. అలాగే చిరంజీవిపై కూడా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది.

ఇటీవ‌ల ఆలీతో స‌ర‌దాగా ప్రోగ్రామ్‌కు వ‌చ్చిన ఆమె ప‌లు ఇంట్రెస్టింగ్ విష‌యాలు చెప్పింది. వ్య‌క్తిగ‌తంగా చిరంజీవి అభిమాని అయిన ఆమె ఆయ‌న్ను మొద‌టిసారి చూసిన వెంట‌నే ఏడ్చేసానంటూ చెప్పుకొచ్చింది. ఇక ఆలీ మాట్లాడుతూ 100ముద్దులు ఇవ్వాల‌నుకునే హీరో ఎవ‌రైనా ఉన్నారా అని అడ‌గ్గా.. ప‌వ‌న్ క‌ల్యాణ్ అని ట‌క్కున స‌మాధానం చెప్పింది. అంటే ప‌వ‌న్‌పై ఆమెకున్న అభిమానం అలాంటిదని అర్థం అవుతోంది. ఈ కామెంట్లు ఇప్పుడు వైర‌ల్‌గా మారాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version