కరోనా వైరస్‌ను కావాలనే రిలీజ్‌ చేశారు.. చైనా వైరాలజిస్టు సంచలనం..

-

కరోనా వైరస్‌ను కావాలనే రిలీజ్‌ చేశారు అంటూ చైనా వైరాలజిస్టు సంచలనం విష‌యం బ‌య‌ట‌పెట్టింది. చైనాలోని వూహాన్‌ సిటీ దగ్గర్లో ఉన్న వూహాన్‌ ల్యాబ్‌ నుంచి కరోనా వైరస్‌ లీక్‌ అయ్యిందని ఇప్పటికీ వార్తలు వస్తున్న విషయం విదితమే. పాశ్చాత్య దేశాలు అయితే కరోనా వైరస్‌కు కారణం చైనాయే అని ఇప్పటికీ ఆరోపిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన నిపుణుల బృందం వూహాన్‌లో పర్యటించినా వారు చైనాకు క్లీన్‌ చిట్‌ ఇచ్చారు. అయితే తాజాగా మరోమారు ఈ వివాదం తెరపైకి వచ్చింది.

గత ఐదారు ఏళ్ల కిందటే చైనా కరోనా వైరస్‌ను సృష్టించిందని, ప్రపంచ దేశాలపై ఆ వైరస్‌ను జీవాయుధంగా ప్రయోగించేందుకు వైరస్‌ను సృష్టించారని ఓ ఆస్ట్రేలియా పత్రిక తాజాగా సంచలన కథనాన్ని ప్రచురించింది. అయితే ఆ విషయం నిజమేనని చైనాకు చెందిన ఓ వైరాలజిస్టు సంచలన విషయాలను బయట పెట్టారు.

చైనాలోని పీఎల్‌ఏ ల్యాబ్‌ నుంచి కరోనా వైరస్‌ను కావాలనే బయటకు రిలీజ్‌ చేశారని, ఆ వైరస్‌ను సృష్టించేందుకు చైనా భారీ ఎత్తున డబ్బును పెట్టుబడిగా పెట్టిందని చైనాకు చెందిన వైరాలజిస్టు డాక్టర్‌ లి-మెంగ్‌ యాన్‌ తెలిపారు. ఈ మేరకు ఆమె భారత్‌కు చెందిన ఓ మీడియా సంస్థతో తాజాగా మాట్లాడారు.

ప్రపంచ దేశాలపై దాడులు చేసేందుకే చైనా జీవాయుధాలను తయారు చేయడం ప్రారంభించిందని, అందులో ఒకటి కరోనా వైరస్‌ అని డాక్టర్‌ యాన్‌ తెలిపారు. కరోనా వైరస్‌ ఒక బయో వెపన్‌ అని అన్నారు. ఐదారు ఏళ్ల కిందటే దీని సృష్టి కోసం ప్రయత్నాలు ప్రారంభించారని తెలిపారు. అందులో భాగంగానే గతేడాది వూహాన్‌లో వైరస్‌ను లీక్‌ చేసి ట్రయల్‌ చేశారని, తరువాత దాన్ని ప్రపంచం మీదకు వదిలారని ఆరోపించారు. అయితే వూహాన్‌ లోని ల్యాబ్‌ నుంచి కరోనా వైరస్‌ లీక్‌ అయిందని మరోసారి వస్తున్న వార్తలపై చైనా ఇంకా స్పందించలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version