ఆ కోరికలతో నిద్రలేని రాత్రులు గడిపాను: సురేఖ వాణి

-

టాలీవుడ్ నటి సురేఖ వాణి గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు ఎన్నో రకాల పాత్రలు చేస్తూ అందర్నీ మెప్పించింది. సురేఖ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పలు ఫోటోలు కూడా షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఈమె షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారుతాయి. ఆమెకు సంబంధించిన వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నా భర్త చనిపోక ముందు నన్ను ఎంతో గౌరవించేవారు నేను కూడా బాగా చూసుకున్నాను.

కానీ సడన్ గా ఆయనకి అనారోగ్యం రావడం వలన హాస్పిటల్లో చేర్పించాల్సి వచ్చింది దీంతో నేను అక్కడే జాగ్రత్తగా ఉండి చూసుకున్నప్పటికీ మా అత్తింటి వారు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. వాటిని పట్టించుకోకుండా నా భర్త ఆరోగ్యం బాగుపడాలని కోరుకున్నాను కానీ నా భర్త నన్ను విడిచి వెళ్లిపోయారు ఒకరోజు ఒక గంట నా భర్తతో మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండునని పదేపదే కోరుకునే దాన్ని. కనీసం కలలో అయినా కనపడితే మాట్లాడి పలు విషయాల గురించి అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాను క్షమాపణలు చెప్పాలనుకున్నాను కానీ అతను కలలో కూడా కనిపించలేదని కొన్ని రోజులపాటు ఆయన కనిపించాలని కోరిక అలా ఉండిపోయింది అని సురేఖ వాణి చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news