డ్రగ్స్ కేసు వలన అమెరికాకు పారిపోయిన సురేఖ వాణి..!

-

టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లలో ఒకరైన సురేఖ వాణి ఇదివరకు ఏడాదికి కనీసం అరడజను సినిమాలతో అలరిస్తూ ఉండేది ఈ మధ్య పెద్దగా సినిమాల్లో కనపడట్లేదు సురేఖ వాణి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేయడం మానేసినప్పటికీ ఖరీదైన కారు కొనుక్కుని విలాసవంతమైన జీవితాన్ని గడుపుతోంది. కెపి చౌదరి డ్రగ్స్ కేసులో ఆమె పేరు వినిపించడం మీద క్లారిటీ ఇచ్చింది సురేఖ వాణి. నాకు ఇప్పటివరకు సొంత ఇల్లు లేదు పాత కారు అమ్మేసి సెకండ్ హ్యాండ్ లో ఈఎంఐ లో రేంజ్ రోవర్ కొన్నాము. సెకండ్ మ్యారేజ్ అని వార్తలు వస్తున్నాయి కానీ ఈ రిలేషన్ షిప్ అంటేనే భయం వేస్తోంది వాటి మీద నమ్మకం లేదు.

ఎప్పుడు దేవాలయానికి వెళ్తుంటా అలా వెళ్ళిన ప్రతిసారి ప్రశాంతమైన జీవితాన్ని ఇవ్వమని నా వాళ్ళని చూసుకునే ధైర్యాన్ని ఇవ్వమని కోరుకుంటాను అని సురేఖ వాణి అన్నారు. దాదాపు 300 మంది ఫోటోలు చౌదరి ఫోన్లో ఉంటే ముగ్గురు ఫోటోలు మాత్రమే బయటికి వచ్చాయి అందులో నా ఫోటో కూడా బయటకు తీశారు చాలామంది నానా రకాలుగా మాట్లాడుకున్నారు దాని వలన నాకు మానసికంగా ఒత్తిడి పెరిగింది అయితే చాలామంది ఈ విషయాన్ని వదిలేయమన్నారు కానీ మనశ్శాంతి కోసం అమెరికా వీళ్లా కానీ అందరూ పారిపోయిందన్నారు ఆ ట్రిప్ వల్ల నేను ఆ ఘటన నుండి బయటకు వచ్చాను అని సురేఖ వాణి అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version