టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు సినిమాలు ఇటు రాజకీయాలను సమపాళ్లలో సాగిస్తూ ఫ్యాన్స్ సంఖ్యను పెంచుకుంటూ పోతున్నారు. పవన్ కళ్యాణ్ కొత్త సినిమా గురించి ఒక వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. తమిళ దర్శకుడు మరియు విలక్షణ నటుడు అయిన సముద్ర ఖని దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారని కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటుగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్నాడు. అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా టైటిల్ ను BRO అని ఫైనల్ చేసినట్లు సినిమా వర్గాలు అంటున్నాయి.
సర్ప్రైజ్: పవన్ కళ్యాణ్ కొత్త సినిమా టైటిల్ కంఫర్మ్… “BRO”
-