గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సూర్య భామ.. ట్రోలింగ్ పై షాకింగ్ రిప్లై..!!

-

అపర్ణ బాలమురళి.. తమిళ్ స్టార్ హీరో సూర్య హీరోగా నటించిన సూరారై పొట్రు దీనిని తెలుగులో ఆకాశమే నీ హద్దురా పేరుతో విడుదలైన చిత్రం ఇది. ఇందులో హీరోయిన్ గా అపర్ణ బాలమురళి నటించినా.. మొదటి సినిమాతోనే తన నటనకు ప్రశంసలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ సాంప్రదాయ చీరకట్టులో అచ్చం తెలుగింటి అమ్మాయిగా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో అపర్ణ పాత్రకు సౌత్ ఆడియన్స్ సైతం ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమాకు ఏకంగా జాతీయ అవార్డును కూడా అందుకుంది. ఇకపోతే ఈ సినిమా తర్వాత ఈమె వీట్ల విసేనవం, దీతుమ్ నన్నుమ్ వంటి సినిమాలలో కూడా నటించి మెప్పించింది. ప్రస్తుతం మలయాళంలో ఆరు అనే సినిమా.. తమిళంలో నీతం ఒరు వానం చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఇటీవల ఈమె పుట్టినరోజు సందర్భంగా ఈమె నటిస్తున్న నిత్యం ఆరు దానం అనే సినిమాలోని తన ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు సినిమా మేకర్స్. ఇందులో ఈమె చాలా లావు అయినట్లు మనం చూడవచ్చు. ఇక ఇటీవల తనపై వస్తున్న ట్రోలింగ్, బాడీ షేవింగ్ పై స్పందించిన అపర్ణ.. శరీర బరువుకు, ప్రతిభకు సంబంధం లేదు .. ఒక వ్యక్తి బరువు పెరగడానికి శరీరంలోని అనేక సమస్యలు కారణమవుతాయి.. నేను బొద్దుగా ఉన్నాను అంటే అదే లుక్కులో నటించమని అడిగిన వాళ్లు కూడా చాలామంది ఉన్నారు. ముఖ్యంగా నా శరీర ఆకారం పై వస్తున్న కామెంట్స్ కు నేను మొదట్లో బాధపడ్డాను..

అంతేకాదు కొంతమంది తల్లి పాత్రలో నటిస్తావా ? అని అడుగుతున్నారు .. కానీ నా వయసు అమ్మ పాత్రలో నటించే అంత కాదు.. కొందరు సన్నగా ఉంటేనే హీరోయిన్గా భావిస్తారు.. సన్నగా ఉంటేనే హీరోయిన్గా ఛాన్స్ దొరుకుతుంది అన్న విషయం ఏంటో అనేది నాకు మాత్రం అర్థం కావడం లేదు.. ఇక హీరోయిన్లకు ఫిజికల్ అప్పియరెన్స్ చూసుకుంటారు అంటూ అపర్ణ తనదైన శైలిలో చెప్పుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news