మళ్లీ ఓటీటీకి జై కొట్టిన సూర్య ఫ్యామిలీ

-

మొన్న అన్న చేశాడు.ఇప్పుడు తమ్ముడు చేస్తున్నాడు.అన్న చేసినప్పుడు ఎగ్జిబిటర్లంతా అంత ఎత్తున లెగిసిపడ్డారు.తమ్ముడి దగ్గరకు వచ్చేసరికి ఎవరు నోరు మెదపడం లేదు. లాక్ డౌన్ లో చోటా హీరోల సినిమాలు ఓటీటీలకు మెల్లగా వచ్చాయి.అలా వచ్చిన టైమ్లో థియేటర్లకు రాకుండా ఓటీటీలకు వెలా వెళ్తారు అని ఎవ్వరు ఎవ్వరినీ అడగలేదు.కాని బడా హీరోల దగ్గరకి వచ్చేసరికి అటు అభిమానులు,ఎగ్జిబిటర్లు ఓటీటీల వైపు హీరోలను చూడనీయలేదు.

ఇక కోలీవుడ్ లో ఈ ఓటీటీ రచ్చ గట్టిగానే జరిగింది.ధనుష్ జగమే తంత్రం మ్యాటర్లో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి.దీంతో హీరోలు థియేటర్లకు వెల్లకుండా ఓటీటీలకు వెల్లే సాహసం చేయలేదు.బట్ ఈవిషయంలో సూర్య కాస్త అగ్రెస్పివ్ గా మూవ్ అయ్యాడు.తన వైఫ్ జ్యోతిక నటించిన పొన్ మగల్ వందాల్ ను ఓటీటీలకు ఇచ్చి వివాదాన్ని రాజేశాడు. పొన్ మగల్ వందాల్ తెలుగులో “36వయస్సులో “పేరుతో రిలీజ్ అయింది.త‌మిళ‌నాట ఎందరో ఎగ్జిబిట‌ర్లు అడ్డంకులు సృష్టించినా అత‌ను ఆగ‌లేదు. సూర్య ఇచ్చిన స్ఫూర్తితోనే ఆ త‌ర్వాత ద‌క్షిణాదిన వివిధ భాష‌ల్లో వచ్చిన పెద్ద సినిమాలు ఓటీటీల్లోకి రావడం మొదలైంది.తాను న‌టించిన ఆకాశం నీ హ‌ద్దురాను సైతం అలా వచ్చిందే.

ఇప్పుడు ఇదే ఫ్యామిలీ నుంచి మూడో సినిమా రాబోతుంది.అది మరేదో కాదు సుల్తాన్ .సూర్య బ్రదర్ కార్తి నటించిన ఈ ప్రాజెక్ట్ …ఓటీటీ రిలీజ్‌కు రెడీ అవుతుంది.డిస్నీ+ హాట్ స్టార్ వాళ్లు దీనిని కొంటున్నారు. ఆ దిశ‌గా డిస్కషన్స్ అవుతున్నాయి. త‌మిళ‌నాట థియేట్రిక‌ల్ రిలీజ్ కోసం మాస్టర్ స‌హా ఎన్నో సినిమాలు పోటీలో ఉంటే.. వాటిని కాదని మంచి ఆఫ‌ర్ వ‌స్తే ఓటీటీ రిలీజే బెటరనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తుంది.ఏది ఏమైనా కోలీవుడ్ థియేటర్ సిస్టమ్ కు సూర్య ఫ్యామిలీతో గట్టి దెబ్బే తగిలింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version