INDvsWI : ఆదుకున్న సూర్య కుమార్.. వెస్టిండీస్ టార్గెట్ 238

-

భారత్, వెస్టిండీస్ మ‌ధ్య రెండో వ‌న్డే మ్యాచ్ ఆహ్మ‌దాబాద్ లోని న‌రేంద్ర మోడీ స్టేడియంలో ఆడుతున్నారు. కాగ ఈ మ్యాచ్ లో కీలక‌మైన టాస్ ను వెస్టిండీస్ నెగ్గింది. వెస్టిండీస్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొద‌ట బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ త‌గిలింది. మంచి ఫామ్ లో ఉన్న కెప్టెన్ రోహిత్ శ‌ర్మ (5) మూడో ఓవ‌ర్లోనే అవుట్ అయ్యాడు. వెనువెంట‌నే మ‌రో ఓపెన‌ర్ రిషభ్ పంత్ (18), కోహ్లి (18) వెనుతిరిగారు. దీంతో 12 ఓవర్లోనే 3 కీల‌కమైన వికెట్లు కోల్పోయి టీమిండియా క‌ష్టాల్లో ప‌డింది.

అప్పుడు వ‌చ్చిన కెఎల్ రాహుల్ (49), సూర్య కుమార్ యాద‌వ్ (64) టీమిండియా స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు. నాలుగో వికెటు 91 ప‌రుగుల‌ను జోడించారు. వీరు అవుట్ అయిన త‌ర్వాత చివ‌ర్లో సుంద‌ర్ (24), దీప‌క్ హుడా (29) చేసి స్కోరు బోర్డును 200 మార్క్ ను దాటించారు. వెస్టిండీస్ బౌల‌ర్లు జోసెఫ్, స్మిత్ త‌ల రెండు వికెట్ల చొప్పున వికెట్లు తీసుకున్నారు. కెమ‌ర్ రోచ్, హోల్డ‌ర్, హోసేన్, ఫాబియ‌న్ అలెన్ ఒక్కో వికెట్ చోప్పున ప‌డ‌గొట్టారు. దీంతో నిర్ణిత 50 ఓవ‌ర్ల‌లో టీమిండియా 9 వికెట్లను కోల్పోయి.. 237 ప‌రుగులు చేసింది. వెస్టిండీస్ ఈ మ్యాచ్ లో నెగ్గి.. సిరీస్ బ‌రిలో ఉండాలంటే.. 238 ప‌రుగులు చేయాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version