నిన్న జరిగిన మూడో వన్డేలో టీమిండియా చెత్త బ్యాటింగ్ కారణంగా… ఆస్ట్రేలియా జట్టు అవలీలగా విజయం సాధించింది. నిన్నటి మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 269 పరుగులు చేసింది. ఇక 270 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆది నుంచి… తడబడింది. విరాట్ కోహ్లీ మరియు హార్దిక్ పాండ్యా తప్ప అందరూ విఫలమయ్యారు.
దీంతో టీమిండియా 49.1 ఓవర్లలో 248 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. దీంతో ఆస్ట్రేలియా సిరీస్ గెలుచుకుంది. ఇక ఈ మ్యాచ్ లో గోల్డెన్ డక్ గా వెనదిరిగిన సూర్య కుమార్ యాదవ్ అత్యంత చెత్త రికార్డును నెలకొల్పాడు. ఓ వన్డే సిరీస్ లో వరుసగా మూడు మ్యాచ్ల్లో గోల్డెన్ డక్ అవుట్ అయినా తొలి క్రికెటర్ గా సూర్యకుమార్ నిలిచాడు. అదేవిధంగా 3 వన్డే ల సిరీస్ లో మూడుసార్లు డకౌట్ అయిన మొదటి భారత బ్యాటరీ కూడా సూర్యానే. ఇక ఓవరాల్ గా వన్డేల్లో వరుసగా మూడుసార్లు డక్ అవుట్ అయిన ఆరవ భారత బ్యాటర్ గా సూర్య కుమార్ యాదవ్ నిలిచాడు.