TSPSC పేపర్ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్టు

-

టీఎస్​పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీకేజీ వ్యవహారంలో సిట్ దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. గ్రూప్​-1లో 121 మంది విద్యార్థులకు 100 మార్కులు వచ్చినట్లు సిట్​ దర్యాప్తులో తేలింది. ఆరు రోజుల కస్టడీలో భాగంగా 9 మంది నిందితులను విచారిస్తున్న సిట్.. పలు కీలక ఆధారాలు రాబట్టింది.

టీఎస్‌పీఎస్‌సీ నుంచి 20 మంది పరీక్ష రాస్తే అందులో ఇద్దరికి 100కు పైగా మార్కులు వచ్చినట్లు సిట్​ అధికారులు గుర్తించారు. టీఎస్‌పీఎస్‌సీ ఉద్యోగి రమేష్‌కు, మహిళా ఉద్యోగినికి కూడా 100కు పైగా వచ్చినట్లు సిట్​ అధికారులు తెలుసుకున్నారు. ఈ ఆధారాలతో కమిషన్​లోని రమేష్​, షమీమ్ లతో పాటు సురేష్ అనే వ్యక్తిని నిందితులుగా చేర్చి కేసు నమోదు చేశారు. ఈ ముగ్గురిని రేపు కోర్టులో హాజరుపర్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న సిట్​కు.. టీఎస్​పీఎస్సీ కమిషన్​లో 20 మందికిగానూ, 8 మంది మెయిన్స్​కు అర్హత సాధించినట్లు గుర్తించారు. ఈ ముగ్గురి చేరికతో ప్రశ్నాపత్నం లీకేజీ కేసులో నిందితుల సంఖ్య 12కు చేరుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news