సూర్యాపేట ర్యాగింగ్ ఘటనలో ట్విస్ట్… ర్యాగింగ్ జరగలేదంటున్న విచారణ కమిటీ..!

-

సూర్యాపేట మెడికల్ కాలేజీ ర్యాగింగ్ ఘటనలో ట్విస్ట్ ఎదురైంది. మొదటి సంవత్సరం మెడికల్ విద్యార్థిపై కొందరు రెండో సంవత్సర విద్యార్థులు ర్యాగింగ్ కు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై ఇప్పటికే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డి ఆదేశాలు మేరకు ఓ కమిటీని ఏర్పాటు చేశారు. అయితే ఈ కమిటీ తాజాగా నివేదికను ఇచ్చింది. అయితే ఈ ఘటనలో ర్యాగింగ్ జరగలేదని కమిటీ తన విచారణలో తెలిపింది. కేవలం సీనియర్లు, జూనియర్ల మధ్య ఘటనగా విచారణ కమిటీ తేల్చింది.

ఇదిలా ఉంటే పోలీసులు మాత్రం దీన్ని ప్రాథమికంగా నిర్థారించారు. ఈరెండు విచారణల్లో విరుద్ధ ప్రకటనలు వచ్చాయి. అయితే ఇప్పటికే ఈ ఘటనపై ర్యాగింగ్ కు పాల్పడ్డారని ఆరుగురు విద్యార్థులపై సస్పెన్షన్ వేటు పడింది.

కాగా ఇటీవల సూర్యాపేట మెడికల్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న స్టూడెంట్ ను రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ర్యాగింగ్ చేశారని ఫిర్యాదు అందింది. ఇంటి నుంచి శనివారం కాలేజీ హాస్టల్ వెళ్లిన విద్యార్థిని బట్టలు విప్పించి మొబైల్ లో షూట్ చేశారు. దీంతో అక్కడి నుంచి తప్పించుకున్న సదరు విద్యార్థి విషయాన్ని తండ్రికి చెప్పాడు. తండ్రి డయల్ 100 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. దీంతో విద్యార్థిని పోలీసులు రక్షించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news