సుశాంత్ ది ఆత్మహత్య కాదు.. హత్యే..?

-

దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ప్రముఖ బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్(34) ఆత్మ‌హ‌త్య కేసులో నిన్నటి నుంచి ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ప్రధాని మోడీ సహా ఎందరో రాజకీయ, సినీ, సామాజిక ప్రముఖులు ఎందరో తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం ఇప్పటికీ తెలియట్లేదు. ఈ నేపధ్యంలో సుశాంత్ సింగ్ మామ పిడుగులాంటి వార్తా పేల్చారు. సుశాంత్ మృతి వెనుక అనేక అనుమానాలున్నాయ‌ని, వెంట‌నే  న్యాయ విచారణ జ‌రిపించాల‌ని ఆయన డిమాండ్ చేశారు. మీడియాతో మాట్లాడిన ఆయ‌న…‌ సుశాంత్ ఆత్మ‌హ‌త్య చేసుకునేంత పిరికివాడు కాద‌ని, అత‌ని మృతి వెనుక ఏదో కుట్ర ఉండ‌వ‌చ్చ‌న్నారు. సుశాంత్‌ది ముమ్మాటికి హత్యే అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. ప్ర‌స్తుతం పోలీసులు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇంటి చుట్టుప‌క్క‌ల ఉండే వారిని విచారిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news