బీహార్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఎవరు విజయం సాధిస్తారు అని దేశం అంతా ఎదురు చూస్తుంది. బీహార్ ఎన్నికల్లో అధికార విపక్షాలు పట్టుదలగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ ఎన్నికలు అన్ని పార్టీలకు చాలా కీలకం కూడా. పెద్ద రాష్ట్రం కావడంతో ప్రచార హోరు ఆసక్తిగా ఉంది. అయితే బీహార్ లో ఈనెల 28న తొలివిడత పోలింగ్ జరగనుండగా బీహార్ ఎన్నికల ప్రచారం మరింత హీటెక్కింది. అక్కడి నేతలు పోటాపోటీ ప్రచారాలు చేస్తున్నారు.
అధికారంలోకి వస్తే సీతమ్మ తల్లికి గుడి కడతామని ఎల్జేపీ అంటోంది. అయితే తాజాగా ప్రచార సభలో జనతాదళ్ రాష్ట్రవాది అభ్యర్థి హత్య కాబడడం కూడా సంచలనం రేపింది. నారాయణ్ సింగ్ ను దుండగులు కాల్చి చంపారు. అంతే కాదు తనను చంపేందుకు లాలూ ప్రసాద్ యాదవ్ తాంత్రిక పూజలు చేశారని బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీ ఆరోపణలు చేశారు. అయితే సుశీల్ మోడీ వ్యాఖ్యలు వికారం పుట్టించేలా ఉన్నాయని లాలూ కుమారుడు తేజస్వీ పేర్కొన్నారు.