ఢిల్లీ తెలంగాణ భవన్ లో… స్వామి వివేకానంద జయంతి..!

-

ఢిల్లీ తెలంగాణ భవన్ లో స్వామి వివేకానంద జయంతి ని జరిపారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దీపదాస్ మున్షి దీనిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ భారత్ ప్రతిష్టను ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి వివేకానందుడు అని అన్నారు. అలానే యువత సన్మార్గం గా నడవాలి అని చెప్పారు.

ఆయన చరిత్ర అందరికీ స్ఫూర్తి దాయకం అన్నారు. వివేకా నందుడి స్పూర్తి తో చరిత్ర ని మనం సృష్టించాలి అని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. విద్యార్థి దశ లో నేను వివేకా నందుడి స్పూర్తి తో పని చేశాను అని మంత్రి పొన్నం ప్రభాకర్ ఢిల్లీ తెలంగాణ భవన్ లో స్వామి వివేకానంద జయంతి వేడుకల్లో చెప్పారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివేకా నందుడు జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని చెప్పారు. మహనీయుల బాట లో నడిస్తే గొప్ప మార్పు ఉంటుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news